రాష్ట్రాన్ని విభజిస్తే మెరుపు సమ్మే

 

Apngo Telangana, United andhra pradesh, Separate Telangana

 

 

ఢిల్లీ తెలంగాణ వేడి రాచుకుంటుంటే సీమాంద్ర సమైఖ్య సెగలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఢిల్లీ పెద్దలతో లాభీయింగ్‌ చేస్తుండగా..మరి కొందరు నాయకులు రాజీనామాలకు సిద్దపడ్డారు..

 

ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీఎన్జీవో) సంఘం ఎట్టి పరిస్థితు్లోనూ రాష్ట్రన్ని విడదీయవద్దని డిమాండ్ చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే సీమాంద్రప్రాంత ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా, త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రటించింది..



అంతేకాదు తెలంగాణ ఎర్పడే పరిస్థితి వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. కొత్త రాష్ట్రం ఎర్పడితే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దవుతాయని, ఫలితంగా సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని తెలిపారు.



అంతే కాదు త్వరలో సమైఖ్య రాష్ట్ర ఆవశ్యకత ఢిల్లీ నాయకత్వానికి తెలిసేలా హైదరభాద్‌లో భారీ బహింరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ఉద్యోగ విద్యార్థి సంఘాలతో పాటు.. రాజకీయ నాయకులు కూడా పాల్గొంటానరని ప్రకటించారు..