ఐఏఎస్ నిర్వాకం ! ఒణుకుతున్న జగన్ టీమ్!!

అద్దంకి పోయిన సింగడు పోనూ పోయాడు, రానూ వచ్చాడని సామెత. ఆయనో ఐ ఏ ఎస్ అధికారి. అలాంటి..ఇలాంటి ఆఫీసర్ కూడా కాదు. సీనియర్ మోస్ట్ ఐ ఏ ఎస్ .... చేస్తోంది అత్యంత కీలకమైన ఉద్యోగం.. చాలా ముఖ్యమైన పోర్ట్ ఫోలియో .. ఎక్కే విమానం..దిగే విమానం ....ఊపిరి సలపలేనంత పని.. ఒకటే ఒత్తిడి... మన దేశం లో లాక్ డౌన్ ప్రకటించకముందు , ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధిగా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లి, పారిశ్రామిక రంగ పెట్టుబడుల నిమిత్తంఅక్కడి అధికార యంత్రాంగాలతో చర్చలు జరిపారు... అంతే కాదు... అక్కడి నుంచి కిందటి వారమే , తిరిగి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. ఆయన ఒక్కరే కాదు... ఆయనతో పాటు ఆయా దేశాల డెలిగేషన్స్ బృందాలు కూడా వచ్చాయి.. ఆయా డెలిగేషన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావటం, సమావేశం కావటం, ఇవన్నీ కూడా చక చకా జరిగిపోయాయి... అయినాకూడా సి ఎం ఓ ఈ విషయాన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ..... ఒక పక్క ప్రపంచం మొత్తం అతలాకుతలమై పోతుంటే, సీరియస్ నెస్ కొరవడిన ఆ అధికారి చేసిన నిర్వాకం వల్ల , ఇప్పుడు సి ఎం క్యాంప్ కార్యాలయం వద్ద సిబ్బంది గడ గడా వణికిపోతున్నారు. ప్రధాన మంత్రి లాక్ డౌన్ ప్రకటించక ముందే, ఆ సీనియర్ మోస్ట్ ఐ ఏ ఏ ఎస్ అమరావతికి తిరిగి వచ్చేసినప్పటికీ, సెల్ఫ్ క్వారంటైన్ పాటించకపోవడం రాజధాని ప్రాంత వాసులందరినీ , ప్రత్యేకించి సి ఎం ఓ నూ  కలవరపెడుతోంది. ఐరోపా దేశాల్లో ..ఒక దేశం ప్రధాని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన విషయాన్ని, మరో దేశ యువరాణి కరోనా తో మరణించిన విషయాన్నీ, జర్మనీ లో అయితే ఏకంగా కరోనా కల్లోలం కారణంగా అక్కడి ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్న విషయాన్నీ ఇంత  కన్వీనియెంట్ గానూ, చాలా తేలిగ్గానూ తీసుకున్న ఆ ఐ ఏ ఎస్ అధికారి విషయం లో చీఫ్ సెక్రెటరీ గానీ, సి ఎం ఓ గానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం చూస్తుంటే, భయమేస్తోందని సెక్రటేరియట్ కారిడార్లు వ్యాఖ్యానిస్తున్నాయి. హతవిధీ.... ఇంతగా సీరియస్ నెస్ కొరవడిన వ్యవస్థలు సాక్షాత్తూ సి ఎం కార్యాలయాల్లోనే పని చేస్తుంటే, ఇక కరోనా నియంత్రణ లో చిత్తశుద్ధి కోసం మాట్లాడుకోవటం లో అర్ధం లేదనేది ఉద్యోగుల భావన! 

ఇక్కడో విషయం గమనించాలి.. ఒక పక్క సి ఎం జగన్ మోహన్ రెడ్డి రేయింబగళ్లు, రివ్యూలు చేస్తూ..కరోనా కట్టడికి ఎక్కడికక్కడ మార్గదర్శకాలు, సూచనలు చేస్తుంటే, ఈ ఐ ఏ ఎస్ ఒళ్ళు పై తెలీకుండా, ఏకంగా ఆ రెండు దేశాలు--సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా లకు చెందిన బృందాలను తన కూడా పెట్టుకుని సి ఎం ముందు హాజరు పర్చడమేమిటని ఐ ఏ ఎస్ లే చెవులు కొరుక్కుంటున్నారు. పై పెచ్చు, ఆ ఐ ఏ ఎస్ సెల్ఫ్ క్వారంటైన్ ను కూడా పాటించకుండా జన బాహుళ్యం లోకి వచ్చేయటం కూడా సెక్రెటేరియేట్ వర్గాలను, సి ఎం ఓ సీనియర్లనూ ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం.. కరోనా ను కట్టడి చేయటానికి సహకరించాలంటూ, సి ఎం జగన్ ఏమో రెండు చేతులూ జోడించి ప్రజలకు నమస్కరిస్తుంటే, ఈ ఐ ఏ ఎస్ మాత్రం...తనకేమీ పట్టనట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.