రెండో విడత పోలింగ్: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

 

AP gram panchayat elections, Andhra Pradesh panchayat elections

 

 

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాతంగా జరిగాయి. ఒంటిగంట వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌటింగ్ ప్రారంభమైంది.

 

రెండో విడతలో 916 పంచాయతీయలు ఏకగ్రీవమయ్యాయి. ముందుగా వార్డుసభ్యుల ఓట్లు లెక్కించి అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. రెండో విడత తొలి ఫలితం చిత్తూరు జిల్లా నుంచి వెలువడింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కనకంపాలెంలో సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందినట్లు సమాచారం. సాయంకాలానికల్లా చాలా వరకూ పలితాలు వెలువడే అవకాశం వుంది.