బాబు కరకట్ట బాబా.. చింతమనేని దెందులూరు బాబా!!

 

చంద్రబాబు రౌడీషీటర్లను.. మాఫియాను.. వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఛీప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. నాకే నోటీసు ఇస్తారా అంటూ పోలీసులను బెదిరిస్తున్నారని అన్నారు. తప్పు చేశారు కాబట్టే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు శ్రీకాంత్. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు ప్రభుత్వ చీఫ్ విప్. వ్యవస్థను నిర్వీర్యం చేశాను.. అందుకే నన్ను మూలన కూర్చోపెట్టారు.. చేసిన తప్పును తెలుసుకొని క్షమించండి అని చెప్పి జిల్లాల పర్యటనకు వెళ్తాడని అనుకున్నాము. కానీ బాబు క్షమాపణ చెప్పే విధంగా కాకుండా.. చింతమనేని లాంటి వారిపై కేసులు పెడతారా, నాకే నోటీసు ఇస్తారా అని ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందని చీఫ్ విప్ వెల్లడించారు. 

తను జిల్లాల పర్యటనల్లో గతంలో ఆయన చేసిన అరాచకాలు కాని వ్యవస్థను నిర్వీర్య పరచటంలో కానీ గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని.. మాఫియాను క్రియేట్ చేసిన విధానాన్ని.. అందరూ గమనించారు. వాటన్నిటి పైనా తాను బేషరతుగా క్షమాపణను ప్రజలు  కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా రౌడీషీటర్ లను వెనకేసుకొచ్చి.. వాళ్ళేదో మహా ఋషులు వాళ్లపైనే కేసులు పెడతారా అంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను పెద్ద దైవంతో సమానమైన వ్యక్తిని నాపై కేసులు పెడతారా.. నాకు నోటీసులిస్తారా.. అని మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యకరంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం  చట్టం ముందు అందరూ సమానమే అన్నారు శ్రీకాంతరెడ్డి. తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.