గుడ్ న్యూస్.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గింపు.!!

 

పెట్రోల్ ధర రోజురోజుకి పెరుగుతోంది.. ఇలానే ఉంటే లీటర్ ధర వందకు చేరేలా ఉందంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేపట్టాయి.. ఓ వైపు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా, మరోవైపు ఏపీ ప్రజలకు మాత్రం ఓ గుడ్ న్యూస్ వచ్చింది.. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించింది.. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు.. రేపు ఉదయం నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి.. వ్యాట్‌ తగ్గింపుతో రాష్ట్రానికి రూ.1120 కోట్ల ఆదాయం తగ్గనుంది.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, కేంద్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.