ఎ.పిలో ఉద్యోగుల జీతాల కోసం ఎదురు చూపులు

ఎ.పిలో ఉద్యోగుల జీతాల కోసం ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. 50శాతం మేర జీతాలు తగ్గించి ఇవ్వాలని అంశంపై కసరత్తు జరుగుతోంది. సీఎఫ్ఎంఎస్, ఆర్థిక శాఖ, గణాంకశాఖల మధ్య ఈ విషయమై ఇంకా సమన్వయం కుదరలేదు. పింఛను దారులకు మరింత ఆలస్యం కావచ్చునని తెలుస్తోంది. ఇంకా వారం  రోజులు పట్టే సూచన కనిపిస్తోందని సెక్రెటరియేట్ వర్గాలు అంటున్నాయి. 
దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. జీతాలు సోమవారం అన్నా వస్తాయొ లేదోనని ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.