ఇసుక కొరత నిజమే.. చర్యలు తీసుకోండి: జగన్

 

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత త్వరలో కొత్త ఇసుక పాలసీని తెస్తామని దానితో సామాన్యులకు ఊరట లభిస్తుందని చెప్పటం జరిగింది. అప్పటి వరకు కలెక్టర్లు ఇసుక లభ్యత, సరఫరా విషయం చూస్తారని చెప్పారు. ఐతే తాజాగా ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ పరిశ్రమతో ముడిపడిన కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపధ్యం లో విపక్షాలు ప్రభుత్వ విధానం పై విరుచుకు పడుతున్నాయి. దీని పై తాజాగా స్పందించిన సీఎం జగన్ ఇసుక కొరత ఉన్నట్లు ఫీడ్ బ్యాక్ వస్తోందని, అధికారులు నిర్మాణాత్మకంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కనీసం 200 రీచ్ ల నుండి ఇసుకను సరఫరా చేయాలని, సెప్టెంబర్ 5 లోగా ప్రతి రీచ్ లో డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని అయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వరదల కారణంగా ఇసుక రీచ్ లన్నీ మూతబడ్డాయని, వరదలు తగ్గగానే ఇసుక లభ్యత మరింత పెరుగుతుందని ఈ సమీక్షలో పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు సీఎం జగన్ కు వివరించారు.