శ్రీకాకుళంలో 4000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి జపాన్ సంసిద్ధం

 

జపాన్ దేశంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు బృందం ఈరోజు ఆదేశానికి చెందిన సుమిటోమో అనే సంస్థతో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకొంది. వాటిలో శ్రీకాకుళం జిల్లా బారువా వద్ద వెయ్యి మెగావాట్స్ సామర్ధ్యంగల నాలుగు ధర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయ పద్దతులు, పరికరాల వినియోగంలో రాష్ట్రంలో రైతులకు తోడ్పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నసుముటిమో శాఖల ద్వారా వివిధ సంస్థల నుండి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు స్థాపించేందుకు పెట్టుబడులు ఆకర్షించడం, ప్రపంచ స్థాయిలో అత్యాధునికమయిన రాజధాని నగరం నిర్మించేందుకు సహకారం, రాజధానిని స్మార్ట్ సిటీగా మలిచేందుకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం, రాజధాని నిర్మాణం కోసం జపాన్ ప్రభుత్వం మరియు జపాన్ దేశానికి చెందిన జే.ఐ.సి.యే., యన్.ఇ.డి.ఓ. మరియు జే.బి.ఐ.సి. తదితర సంస్థల ద్వారా అవసరమయిన నిధులు సమీకరణకు ఇరుపక్షాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసాయి.