ఏపీ బడ్జెట్ 2019-2020 హైలైట్స్ ఇవే !

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఏపీ బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జగన్ నాయకత్వంలోని మంత్రివర్గం భేటీ అయి బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను అమలు చేసేందుకు వీలుగా వాటికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 

కాగా ఏపీ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలను పరిశీలిస్తే బడ్జెట్ అంచనా రూ.2.27,974.99 కోట్లు, కాగా మూలధన వ్యయం: రూ. 32,293.39 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ. 8,994 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 1,80,475 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ. 35,260.58 కోట్లు,  2018-19తో పోలిస్తే బడ్జెట్ 19.32 శాతం పెరుగుదల ఉందని మంత్రి ప్రకటించారు. ప్రధాని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని బుగ్గన పేర్కొన్నారు. 

ఇప్పటికే హోదా వచ్చి ఉంటే 2020 నాటికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచి ఉండేదని బుగ్గన పేర్కొన్నారు. 2022 నాటికి ఏపీ అభివృద్ధిపథంలో ఏ స్థానంలో ఉంటుందనే విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు నిర్ధారిస్తుందని ఆయన అన్నారు.  సింగపూర్‌కు విమాన సర్వీసులను నడపడానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలా ? లేదంటే తల్లులకు పోషకాహారం అందించడం ముఖ్యమో మేం నిర్ణయించుకున్నామని బుగ్గన పేర్కొన్నారు. 

  • మొత్తం బడ్జెట్: రూ.2,27,974 కోట్లు 
  • రెవెన్యూ లోటు: రూ.1778.52 కోట్లు 
  • రెవెన్యూ వ్యయం: రూ.1,80,475 కోట్లు 
  • బడ్జెట్ అంచనా పెరగుదల: 19.32 శాతం 
  • సాగునీటి శాఖ: రూ.13,149 కోట్లు 
  • ఉన్నత విద్య: రూ.3021.63 కోట్లు 
  • మాధ్యమిక విద్య: రూ.29,772.79 కోట్లు 
  • సివిల్ సప్లైస్: రూ.4429.43 కోట్లు 
  • ఆర్థికశాఖ: రూ.46858.81 కోట్లు 
  • సాధారణ పరిపాలన: రూ.1010.78 కోట్లు 
  • వైద్య ఆరోగ్యం: రూ.11399.23 కోట్లు 
  • హోంశాఖ: రూ.7461.92 కోట్లు 
  • గృహ నిర్మాణశాఖ: రూ.3617.37 కోట్లు 
  • ఇరిగేషన్: రూ.13139.05 కోట్లు 
  • విద్యుత్ రంగం: రూ.6861.03 కోట్లు 
  • వ్యవసాయం: రూ.18,327.94 కోట్లు 
  • పశుసంవర్థకం: రూ.1912.29 కోట్లు 
  • బీసీ సంక్షేమం: రూ.7271.45 కోట్లు 
  • అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.446.77 కోట్లు 
  • అగ్రిగోల్డ్ బాధితులకు: రూ.11,50 కోట్లు 
  • ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు 
  • రాజధాని అమరావతికి: రూ.500 కోట్లు 
  • రైతుల పంటకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు
  • వైఎస్సార్ రైతు బీమాకు రూ.1,163 కోట్లు
  • రైతన్నలకు ఉచిత బోర్లు వేయించేందుకు రూ.200 కోట్లు
  • ఏపీలో వృద్ధులు, వితంతువుల పెన్షన్ల కోసం రూ.12,801 కోట్లు కేటాయింపు
  • గ్రామ వాలంటీర్లు: రూ.720 కోట్లు 
  • ఆర్టీసీకి సాయం : రూ.1000 కోట్లు 
  • బీసీ సంక్షేమం: రూ.7271 కోట్లు 
  • బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్: రూ.100 కోట్లు 
  • కాపు కార్పొరేషన్ : రూ.2000 కోట్లు 
  • డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు: రూ. 1180 కోట్లు 
  • ఆరోగ్య శ్రీ: రూ.1740 కోట్లు 
  • ఎస్సీ సబ్ ప్లాన్: రూ.15 వేల కోట్లు 
  • బీసీ సబ్ ప్లాన్ కాంపోనెంట్: రూ.15,061.64 కోట్లు 
  • ఎస్టీ సబ్ ప్లాన్: రూ.4988.52 కోట్లు 
  • పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ: రూ.100 కోట్లు 
  • స్మార్ట్ సిటీలు: రూ.150 కోట్లు 
  • జగనన్న అమ్మ ఒడి పథకం: రూ.6455 కోట్లు  
  • విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్: రూ.200 కోట్లు