ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదా

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన తిరుపతి శాసనసభ్యుడు వెంకట రమణ స్మృతికి నివాళులు అర్పించారు. వెంకట రమణ గురించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన మంచి నాయకుడిని కోల్పోయామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు జగన్ ఈ అంశాన్ని వివాదం చేశారు. తాను కూడా మాట్లాడతానంటూ కాస్త హడావిడి చేశారు. ఆ తర్వాత జగన్ కూడా వెంకట రమణ స్మృతికి నివాళులు అర్పించారు. అలాగే పాకిస్థాన్‌లో జరిగిన తీవ్రవాద చర్యలో 141 మంది విద్యార్థులు మరణించడం పట్ల కూడా ఏపీ శాసనసభ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం తెలియజేసింది. అనంతరం శాసనసభను శుక్రవారం నాటికి సభాపతి కోడెల శివప్రసాదరావు వాయిదా వేశారు.