జూన్ 2... ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

 

ఆంధ్రప్రదేశ్ అవతరణ తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐదు గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం జల వివాదం గురించి కూడా మంత్రివర్గం చర్చించింది. రాజధాని భూ సమీకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. తిరుమలలో అన్యమత ప్రచారంపై మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తన సింగపూర్, జపాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి వివరించారు.