ఏపీ మంత్రులు, అధికారుల ‘జాయ్‌ఫుల్ లివింగ్’

 

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘జాయ్ ఫుల్ లివింగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులపాట ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, యోగా, ధ్యానం లాంటివి మన పనితీరును మెరుగు పరుస్తాయని అన్నారు. మూడు రోజులపాటు ‘జాయ్ ఫుల్ లివింగ్’ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనలో మానసిక వత్తిడి తొలగి, ఇంకా ప్రతిభావంతంగా పని చేయగలుగుతామని చెప్పారు. యోగా, ధ్యానం వల్ల శారీరక సమస్యలు కూడా తగ్గుముఖం పడగాయని అన్నారు. మంత్రులు, అధికారులు అందరూ మూడు రోజులపాటు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని కొంతమంది విమర్శిస్తున్నారని, వాటిని ఎంతమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.