రాష్ట్రంలో గుట్కాలు నిషేధం

 

 

Andhra Pradesh government decides to ban gutkha, AP govt decides to ban gutkha, AP govt issues orders to ban Gutkha

 

రాష్ట్రంలో గుట్కాలు, పొగాకుతో కలిపిన అన్ని రకాల పాన్‌ మాసా లాలను నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఆహార భద్రతాశాఖ కమిషనర్‌ ప్రజా రోగ్యం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా గుట్కాలతోపాటు అన్ని రకాల పొగాకు పాన్‌ మాసాలాలను నిషేధిం చడానికి అనుమతి ఇవ్వాలని చేసిన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించింది. వాటిని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్‌ 6 ను విడుదల చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుంది.


రాష్ట్రంలో పొగాకు కలిపివున్న గుట్కా, పాన్‌ మాసా లాల ఉత్పత్తి, నిల్వలు, అమ్మకాలు, రవాణా చేయ రాదని ప్రకటించింది. మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో గుట్కా, పాన్‌మాసాలాలు నిల్వ ఉంచడంపై పూర్తి నిషేధాన్ని విధించడమైంది. నిషేధిత పదార్ధాల రవాణాను అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దు ల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిషేధం అమలుకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని జిఒలో ప్రభుత్వం సూచించింది.