ఈరోజుతో ఆఖరు

 

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూ సమీకరణకు నేటితో ముగియనుంది. భూ సమీకరణ నేటితో ముగిస్తే, రేపటి నుంచి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. భూ సమీకరణకు తమ భూములను అప్పగించని రైతులు భూ సేకరణను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో చివరిరోజు భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చే రైతుల నుంచి వాటిని స్వీకరించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూ సమీకరణ కార్యాలయాల వద్ద వందమంది అదనపు సిబ్బందిని నియమించారు. శనివారం అర్ధరాత్రి వరకు కూడా అంగీకార పత్రాలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా రాజధాని గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇక్కడే మకాం వేశారు. మంగళగిరి, నిడమర్రు, బేతపూడి లే ఔట్లను ఆయన పరిశీలించారు. రాజధాని గ్రామాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణాల క్రబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి శనివారమే ఆఖరి రోజు.