అసెంబ్లీలో గొడవ

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ హుద్ హుద్ తుఫాను మీద చర్చను చేపట్టాని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సభలో లేకపోవడం వల్ల దీనిపై చర్చను శనివారం నాడు జరపాలని కోరారు. దీని మీద మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో వున్నారని, మరికాసేపట్లో సభలో హాజరవుతారని, చర్చను కొనసాగించాలని కోరారు. సీఎం న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వెళ్ళారు. దీన్ని కూడా వివాదం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సభ్యులు కూన రవికుమార్ హుద్ హుద్ మీద చర్చను ప్రారంభించారు. హుద్ హుద్ ప్రకృతి వైపరీత్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థంగా ఎదుర్కొన్నారని అన్నారు.