అమితాబ్‌ @ 72

 

బాలీవుడ్ సూపర్‌స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ శనివారం నాడు తన 72వ పుట్టినరోజు పండుగను తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు జ్వరంతో బాధపడిన అమితాబ్ ఇప్పుడు పూర్తిగా కుదురుకున్నారు. అమితాబ్ భార్య, కుమారుడు, కుమార్తె, కోడలుతో కలసి జరుపుకున్న బర్త్ డే ఫొటోను అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.