ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్ట్

 

 

 Akbaruddin Owaisi Arrested, Akbaruddin Arrested, MIM MLA Akbaruddin Arrested,  Akbaruddin Owaisi Arrested news

 

 

ఎట్టకేలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన వైద్యపరీక్షల అనంతరం అక్బరుద్దీన్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యుల బృందం తేల్చిచెప్పింది. నిర్మల్ కు వాహనంలో తీసుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలడంతో అక్బరుద్దీన్ ను అరెస్టు చేసినట్లు వరంగల్ జిల్లా రేంజి డీఐజీ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. ఈ మేరకు అక్బరుద్దీన్ కి, ఆయన తరపు న్యాయవాదికి అరెస్టు విషయం వెల్లడించారు.


అక్బరుద్దీన్ని అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న ఎంఐఎం కార్యకర్తలు చేరి,పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొడుతున్నారు. అక్బరుద్దీన్ ను తరలించేందుకు ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, పది వాహనాల కాన్వాయ్ ని పోలీసులు సిద్దం చేశారు.  గాంధీ ఆసుపత్రి నుండి సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టాండ్, కామారెడ్డిల మీదుగా పోలీసులు ఆయనను నిర్మల్ తరలించనున్నారు.