హైకోర్టులో పిటిషన్ వేసిన అక్బరుద్దీన్.. నాపై రాజకీయ కుట్ర..!

 

మొగుడ్ని చితకబాది వీధికెక్కి ఏడ్చిన గడుసు ఇల్లాలులాగ, ప్రశాంతంగా ఉన్న ప్రజలమద్య మద్యన మతచిచ్చురగిలించిన అక్బరుద్దీన్ ఓవైసి, తప్పని పరిస్థితుల్లో నేడు లండన్ నుండి హైదరాబాదు తిరిగివచ్చినప్పటికీ, ఆరోగ్యం బాగోలేదనే సాకుతో పోలీసులకి లొంగిపోకుండా, తన న్యాయవాదులు మహ్మద్ ఇస్మాయిల్, రసూల్ ఖాన్ లను నిర్మల్ పంపించి తనకు నాలుగు రోజుల గడువు కావాలని కోరాడు. నాలుగు రోజుల తరువాత, పోలీసులు ఎప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తానన్న పెద్ద మనిషి, అతితెలివి ప్రదర్శిస్తూ హైకోర్టులో ఒక పిటిషను కూడా వేసేడు. దానిలో, తన ప్రసంగంలో కొంత భాగాన్నేసరిగా ఎడిటింగ్ చేయకుండా ఎవరో యూ-ట్యూబ్ లో పెట్టేరని, మీడియా ఒత్తిడి వల్లే తనపై పోలీసులు కేసులు వేసేరని, ఒకే కారణంతో ఒక వ్యక్తిపై పలుచోట్ల కేసులు వేయడం రాజకీయ కుట్రలోభాగమేనని, తన రాజకీయ ప్రత్యర్ధులు తనపై దురుదేశంతోనే ఈ విదంగా కుట్ర పన్నారని, అందువల్ల తనపై నమోదయిన కేసులలో పోలీసులు తదుపరి చర్యలు చెప్పట్టకుండా వారిని ఆదేశించాలని కోరాడు.