భైంసాలో ఎంఐఎం భారీ విజయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసాలో రసవత్తర రాజకీయానికి తెర పడింది.భైంసాలో ఉత్కంఠ వాతావరణం మధ్య ఎన్నిక ఫలితాలు వెలువడ్దాయి.భైంసా మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తాచాటింది. మొత్తం 26 స్థానాల్లో 15 ఎంఐఎం కైవసం చేసుకోగా.. బిజెపి 9 స్థానాల్లో.. స్వతంత్రులు 2 స్థానాలను గెలుపొందారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా మొదటి నుండి బిజెపి , ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఒకానొక దశలో బీజేపీ ముందంజలో కొనసాగగా అనూహ్యంగా ఎంఐఎం చివరి రౌండ్ లో దూసుకెళ్లింది. ఏకంగా 15 స్థానాలను కైవసం చేసుకుని భైంసాను తన ఖాతాలో వేసుకుంది.

ఉదయం 8 గంటల నుంచి ఫలితాలు విడుదలవుతున్న నేపధ్యంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా గట్టి పోటీ కొనసాగింది. మొదటి రౌండ్ లో ఇద్దరు 9 స్థానాలతో సమాంతరంగా ఉండి కౌంటింగ్ రసవత్తరంగా సాగింది.చివరకు 15 స్థానాలతో ఎంఐఎం భైంసా విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ కానీ ఎవరూ గెలవలేదు. మొత్తం మీద చైర్మన్ పీఠంతో పాటు వైస్ చైర్మన్ పీఠాన్ని కూదా ఎంఐఎం తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం.