చల్లబడ్డ అద్వానీ !


..... గోపి చిల్లకూరు

Advani withdraws resignation, RSS brokers truce to end crisis, Advani bjp resignation

 

 

మొత్తానికి RSS చీఫ్ మోహన్ భగవత్ గారి అభ్యర్ధన మేరకు అద్వానిజి సర్దుకొన్నారు. రాజీనామ ఉపసంహరించుకొన్నారు. ఒక యోధుడి రాజీనామా ఒక్కరోజు లో ఎంతటి పెను తుపాను BJP లోను ,దేశం మొత్తం మీద కలిగించిదొ చూసాము . గౌరవం పెద్దరికం లేకుండా ఏ పార్టీ కి మనుగడ వుండదు ,తన రాజీనామా ధిక్కారం తో పార్టీ లో తన స్థాన మేంటో ఒక్కరోజులో తెలియ చెప్పారు.

 

BJP పార్టీ ఎందరో జీవితాలు ఫణంగా పెట్టి నిర్మించుకొన్న పార్టీని ఒక వ్యక్తీ గద్దలా తన్ను కేలుతుంటే కొంచెం ఆపగలిగారు. పార్టీలో మోడిజి లాంటి వారు ఎందరిదో త్యాగఫలం ఈ నాటి కమలం వికాసం అని గట్టిగా చెప్పగలిగారు. గుజరాత్ లో RSS చేయలేని పని అద్వాని కేంద్రంలో చేయగలిగారు.



గుజరాత్ లో మోడీ గారి దెబ్బకు RSS ప్రముఖులు ఇతర ప్రాంతాలకు మారిపోయారు . గతంలో RSS కేంద్ర నాయకులు Vaidya గారు కూడా BJP మాజీ అధ్యక్షుడు గడ్కరికి పదవికి ఎసరు వచ్చినపుడు ఇది నరేంద్ర మోడీ గారి వర్గం కుట్ర వల్లే అని మాట్లాడినది మల్లి మోడీ వర్గీయుల భయంతో ఖండించినది మనకు తెలిసిందే.



గుజరాత్ లోని BJP పార్టీ ని మోడీ గారు  మ్రింగేసి మోడీ బ్రాండ్  పార్టీ గా మార్చింది . ఇప్పుడు గుజరాత్ లో వున్నది మోడీ వ్యక్తీ పార్టీ తప్ప BJP కాదు అన్నది మన కందరికీ తెలిసిందే !. 


    
సరిగ్గా దీనినే అద్వాని గారు వ్యతిరేకించారు . ఒక వ్యక్తీ  పూజ ఏ పార్టీ కి మంచిది కాదు ,దాని నుంచి BJP బయటపడాలి  అన్నది తేల్చి చెప్పారు .


    
ఏ పార్టీ కి ప్రజల సంపూర్ణ మద్దత్తు లేక సంకీర్ణ యుగాలు దశాబ్దాలుగా  నడుస్తున్న సమయం లో భాగస్వామ్య పార్టీ లు లేకుండా కేంద్రం లో ప్రభుత్వాలు ఏర్పడవని అద్వాని గారికి 13 రోజుల్లో ఒకసారి  ,13 నెలల్లో ఒక్క ఓటు తేడాతో మరొక్క సారి  BJP ప్రభుత్వం పడి పోవడం అనేది స్వయానా నేర్చుకొన్న గుణపాటం కనుక ,సర్వం మోడియే,ప్రతి దానికి మోడీ బ్రంహస్రం  అంటూ మోడీ చుట్టూ తిరుగుతున్నా BJP ని  తన రాజీనామా ద్వార  సరి అయిన కక్షలో పెట్టడానికి ప్రయత్నిచారు .


    
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా 2004 లో అత్యుత్సహముతొ సోనియా గాంధీ ,రాహుల్ ,ప్రియాంక గాంధీ ల విదేశీయత పై ఎక్కువ ఆగమాగం చేసి వారికి ఢిల్లీ లో  ఇల్లు కూడా ఇవ్వకూడదని మాట్లాడి ప్రజల్లో  వారి పట్ల సానుభూతి తెప్పించిన  అయన  వివాదాస్పద  వాక్యలు BJP ని ఇరుకున పెట్టి న  సంగతి తెలిసిందే !.


  
అదేవిదముగా ఈ మద్య మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ని ఇబ్బంది పెట్టిన విషయం విదితమే .అలాగే మోడీ గారి దేశభక్తి ,గుజరాత్ అభిరుద్దిని ,క్రియ శీలక నాయకత్వ లక్షణాలను ఎవరు కాదనలేరు కాకపోతే వ్యక్తీ పూజ ఎక్కువై పార్టీ సున్నా అయ్యే పరిస్థితి ఏ పార్టీ కి మంచిది కాదు .


    
BJP లో రగిలిన  భోగి మంటల్లో వేడి నీళ్ళు కాచుకొంటూ కాంగ్రెస్ కు ఇప్పుడు మల్లి మంచి రోజులు మొదలైనట్లు నేటి వరకు తెగ సంబరపడి అద్వాని జి BJP లో సర్డుకోగానే అధికారం పై BJP కి ఎందుకో అంత యావ అంటున్నది .
    
 "ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు BJP లో వాజపే యి మంచోడు అద్వానీ తోనే నరకం అనే వాళ్ళు (Vajpayee is right person in wrong party అనే వారు )  ఇప్పుడు పాపం అద్వానీ చాలా మంచోడు  మోడిజి తో నరకం అంటున్నారు ! ". ఇదే కాంగ్రెస్ మార్కు రాజకీయం !.  అది అర్దం కాకపోతే BJP కి బ్రతుకు భారం అవుతుంది.


BJP లో అనైక్యత పై ద్రుష్టి పెట్టి  అందరిని కలుపుకొని పార్టీ ని ఎన్నికలకు సిద్దం చేయాల్సిన అవసరం భాద్యత నరేంద్ర మోడీ గారి మీద  వున్నది .