హీరో పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ

 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసంచలనానికి తెర తీశాడు. ఎప్పుడు ట్వీటర్ ద్వారా తన ఆలోచనలను అభిమానలతో పంచుకునే వర్మ ఇప్పుడు ఓ స్టార్ హీరోపై తన కామెంట్ చేశాడు. ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ మాత్రమే చేసే వర్మ ఈసారి మాత్రం ఈ ఆ హీరోని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ప్రస్థుతం టాలీవుడ్ లొ  పవర్ స్టార్ మేనియా నడుస్తుంది. పవన్ తో సినిమా అంటే రిలీజ్ కు ముందే మ్యాగ్జిమమ్ బిజినెస్ జరిగిపోతుంది. పవన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే చాలు గంటల్లోనే మ్యాగ్జిమమ్ హిట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రేజ్ గమనించిన రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు.

పవన్ కళ్యాన్ పొలిటికల్ పార్టీ పెడితే చాలా బాగుంటుందన్నాడు. స్వతహాగా అభ్యుదయ భావాలున్న పవన్ స్క్రీన్ హీరోగానే కాదు, రియల్ హీరోగా కూడా మంచి మార్కులు సాధింస్తాడన్నారు. అంతేకాదు గతంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎంజిఆర్, చిరంజీవిల కంటే పవన్ డైనమిక్ లీడర్ అవుతాడని కితాబిచ్చాడు.