హారిసన్ ఫోర్డ్‌కి విమాన ప్రమాదం... గాయాలు

 

ప్రముఖ హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ విమాన ప్రమాదంలో గాయపడ్డాడు. అయితే అది ప్రయాణికుల విమానం కాదు. హారిసన్ ఫోర్డ్‌కి చెందిన సొంత విటేజ్ చిన్న విమానం. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సమీపంలోని వెనీస్ ప్రాంతంలో హారిసన్ ఫోర్డ్ ప్రయాణిస్తున్న ఈ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హారిసన్ ఫోర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విమానం రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి యుద్ధ విమానం. శాంటా మోనికా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం కారణంగా వెనిస్‌‌లోని పెన్మార్క్ గోల్ఫ్ కోర్స్‌లో కుప్పకూలింది.