జాతరలో విషాదం... అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది

 

పండగ జోష్.. జాతరకు వెళుతున్న ఊపు.. ఇలా అందరికి ఉంటుంది. ఊర్లో పండగ అంటే ఆట..పాట.. ఎగ్జిబిషన్ ఉంటే జయింట్ వీల్ , కొలంబస్ లాంటి రైడ్ లు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి జాతరలో  అందరూ ఉత్సాహంగా గడుపుతారు. అలా వెళ్లిన ఓ వ్యక్తి  ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోని రైడ్ లో పట్టు తప్పి కింద పడిపోయాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భీమ్ గల్ లింబాద్రి గుట్ట జాతరలో బ్రేక్ డ్యాన్సింగ్ కారులో ఎక్కాడు. బిచ్కుంద గ్రామానికి చెందిన రవి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి పడిపోయాడు. సీటింగ్ కు బేస్ కు మధ్య పడి నలిగిపోయాడు. అతను కింద పడి పోయిన తర్వాత కూడా చాలా సేపు ఆ డ్యాన్సింగ్ కార్ తిరుగుతూనే ఉంది. అటు వైపు నుంచి ఇటు వైపు నుంచి వచ్చే ఇతర సీట్లు తగులుతూ వెళ్లడంతో నలిగిపోయాడు. ఆపరేటర్ కూడా ఒక్కసారిగా షాక్ కి గురై చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత ఎవరో చెబితే తప్ప మిషన్ ఆపలేదు నిర్వాహకులు. రవిని నిజామాబాద్ లోని ఎంజీఎం ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.