బయటపడుతున్న కెసిఆర్ కుటుంబ అవినీతి!

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 ABK Prasad, ABK Prasad biography, ABK Prasad profile,ABK Prasad jounalist, ABK Prasad Political Articles, ABK Prasad Exclusive Notes

 

 

 

మన తెలంగాణలో చాలా మంచి సామెతలున్నాయి. వాటిల్లో ఒక జాతీయం "తుంపిళ్లబలం'' అని! "తుంపిళ్ళు'' అంటే నీటి తుంపర్లు, చెదిరిపడే నీటిబొట్లను అలా అంటారు. కరీంనగర్ జిల్లావాసి అయిన ప్రసిద్ధ జానపద సాహిత్యవేత్త అయిన వేముల పెరుమాళ్ళు ఈ "తుంపిళ్ళు'' పదం విశిష్టత గురించి వివరిస్తూ ఏ సందర్భంలో ఈ పదాన్ని వాడుతూంటారో చెప్పాడు. కొంతమందట, మనిషి నమ్మకాన్ని అవకాశంగా తీసుకుని ఏదో మహిమ చూపి మంత్రగాళ్ళు తమ ఉనికిని కాపాడుకునే రంధిలో బలహీనుల మీద తమ ప్రభావం చూపిస్తూంటారు, పిచ్చుక మీద బ్రహ్మాస్తంలాగా! ఎందుకంటే, మానసికంగా బలహీనంగా ఉండేవాళ్ళంతా మంత్రానికి దాసులే అవుతారు.

 

అలా మంత్రగాడు ఏ మంత్రం చదివినా తుంపిళ్ళు (నోటితుంపర్లు) వానజల్లులాగా మీద పడిపోతుంటే, ఆ తుంపర్లను భరించలేక మంత్రగాడి మంత్రానికి తలొగ్గుతూంటారట! బుర్రమీసాలు, విచిత్ర వస్త్రాలలో, కపాలం, విభూతి, మంత్రదండం. నిమ్మకాయలు - ఇలా వీటన్నింటితో ఒక మనిషి కనిపిస్తే, వాడి వేష ప్రభావంవల్ల మంత్రాలను నమ్మేవారు చాలామంది ఉంటారట. ఎప్పుడూ కొత్త దుకాణాన్ని కొందరు గొప్పగా అలంకరిస్తూంటారు. వస్తువులకు మంచి ప్యాకింగు ఎలాగో ఇలాంటి ప్రచారం, ఆడంబరమూ ఈ తుంపిళ్ళలాంటి బలమేనట! కోస్తాంధ్రప్రాంతం నుంచి తెలంగాణా ప్రాంతానికి వలస వచ్చిన 'బొబ్బిలిదొర' కె.చంద్రశేఖరరావు (కెసిఆర్) తెలుగుజాతికి వేరుపురుగుగా, విద్రోహిగా మారి వేర్పాటువాదం పేరిట కొన్నాళ్ళుగా సాగిస్తున్న 'ఉద్యమం' స్వరూపస్వభావాలు కూడా ఈ "తుంపిళ్ళు'' లాగానే ఉన్నాయి. 'తుంపిళ్ళ'కు నీటి తుంపర్లకు ఎంత విలువవుందో అంతే విలువ ఉందని పరిణామాలు నిరూపిస్తున్నాయి.
 

రోజులు గడిచినకొద్దీ ఆయని కుటుంబం 'అవినీతి' గురించి అతని పార్టీ "తెరాస''లోని ముఖ్యులూ, నిన్నటిదాకా ఆ పార్టీ పొలిట్ బ్యూరో ముఖ్య సభ్యుడుగానూ, మెదక్ జిల్లా పార్టీ శాఖా అధ్యక్షుడుగానూ ఉంటూ, ఇటీవలనే ఆ పార్టీనుంచి రాజీనామా చేసి బయటపడిన రఘునందనరావు గత కొలది రోజులుగా విడుదల చేస్తున్న ప్రకటనలు ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి; ఆ పార్టీ కార్యకర్తల్ని గందరగోళంలోకి నెట్టి కెసిఆర్ గుణగణాల్ని, అతని కుటుంబసభ్యుల ప్రవర్తననూ ప్రశ్నించేట్టు చేస్తున్నాయి. కెసిఆర్ పోకడలను విమర్శిస్తూ రఘునందనరావు ప్రకటించడంతోనే ఆయనను(రఘునందనరావుని) పార్టీనుంచి సస్పెండ్ చేయడం అన్నది "తెరాస''లొ చెలరేగుతున్న సంక్షోభంలొ ఒక కోణం మాత్రమే. రఘునందనరావు కెసిఆర్ పైన, ఆయని కుటుంబంపైన ఆరోపణలు లేదా తీవ్రమైన అభియోగాలు సామాన్యమైనవి కావు, తేలిగ్గా కొట్టిపారేయగలివిగానూ లేవు.

 

గతంలో "ఇంటర్నెట్'' ద్వారానూ బిజెపిలో పూర్వనాయకుడైన నరేంద్ర, కెసిఆర్ పైన కొన్ని (టిడిపిలొ ఉన్నప్పుడు) రుజువులతో చేసిన తీవ్ర అభియోగాలు, ఆ దరిమిలా తెలంగాణా "రాష్ట్ర సాధన'' పేరుతొ కెసిఆర్ తలపెట్టిన "సెలైన్'' సత్యాగ్రం సందర్భంగా జంటనగరాల్లో "వసూళ్ళు'' గురించ్చి వెల్లువెత్తిన ఆరోపణలు పూర్వరంగంలో తాజాగా రఘునందనరావు తెరాస శాసనసభాపక్షం నాయకుడు హరీష్ రావు (కెసిఆర్ మేనల్లుడు)పైన, కెసిఆర్ ఎన్.ఆర్.ఐ. కొడుకు తారకరామారావుపైన ఎక్కుపెట్టిన అభియోగాలను తేలిగ్గా కొట్టివేయదగ్గవిగా లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా వేర్పాటువాద పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉంటూ వచ్చిన రఘునందనరావుకు పార్టీలో కెసిఆర్ నాయకత్వ పోకడలను ఆయని కుటుంబసభ్యుల ఆర్థిక లావాదేవీల వ్యవహారం బొత్తిగా తెలియకుండా వుండే సమస్య లేదు.



దీనికితోడు సంవత్సరన్నర క్రితమే కెసిఆర్ బంధువు "తెలంగాణా భవన్'' నిర్మాణానికి పార్టీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్రప్రభుత్వం 30ఏళ్ళ "లీజు''కు యిచ్చి, ఆ స్థలంలో పార్టీ కార్యాలయం తప్ప ఇతరత్రా వ్యాపార ప్రయోజనాలకు వాడరాదని అగ్రిమెంటులో షరతు విధించింది కాబట్టి, అక్కడినుంచి టీ.వీ. ఛానళ్ళునడపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి నోటీసు యిచ్చాడు. దానిపైన కోర్టు కూడా ఎందుకు చర్య తీసుకోరాదో సంజాయిషీ యివ్వమన్నది. కాగా, ఇప్పుడు రఘునందనరావు, కెసిఆర్ పైన,హరీష్ రావు, తారకరామారావులపై చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇంతవరకూ ఆ కుటుంబం వరకే పరిమితమైన అంతర్గత కుమ్ములాటలను బజారున పడవేశాయి.

 

దీంతో తెలంగాణా ప్రజలకేగాక, మొత్తం రాష్ట్రప్రజలందరికీ కెసిఆర్ కుటుంబం తెలుగుజాతికి వ్యతిరేకంగా ప్రారంభించిన విద్యోహకర వేర్పాటు 'ఉద్యమ' రహస్యం కాస్తా వెల్లడవుతోంది. అంతకుముందు కాంగ్రెస్ లో ఉంటూ తర్వాత "తెలుగుదేశం''లోకి గెంతి, "దేశం'' ప్రభుత్వంలో తగిన కీలకస్థానం లభించకపోవడం ఆ పార్టీకి రాజీనామా చేసి, సరాసరి 'ముఖ్యమంత్రి'పదవి కోసం స్వార్థబుద్ధితో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని తోటి తెలుగువారిపైన, ఆంధ్రులపైన బూతులతో, అబద్ధ ప్రచారాలతో నిర్మించాడు.
 

కాని కెసిఆర్ సహా అతని కుటుంబసభ్యులపైన రఘునందనరావు ఒక బాధ్యతాయుత స్థానం నుంచి చేసిన ఆరోపణల సారాంశం యిలా ఉంది :
(1) 2008 ఉపఎన్నికల్లో 'తెరాస' పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత పార్టీ అధినేత కెసిఆర్ ను పదవినుంచి తప్పించేందుకు ఆయని మేనల్లుడు టి.హరీష్ రావు కుట్రపన్నాడు.
(2) "దేశం''లో చంద్రబాబులాగానే 'తెరాస'లో నేనూ కష్టపడతా, పార్టీని మళ్ళీ బతికించుకుందాం'' అని హరీష్ రావు కెసిఆర్ పదవిపైన కన్నేసి ఆ విషయాన్ని మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడుగా ఉన్న తనతోనే చెప్పుకున్నాడని రఘునందనరావు వెల్లడి!
(3) తిరుపతిలో హరీష్ రావు తనవద్ద డబ్బుతీసుకున్నట్టు రఘునందనరావు చెప్పాడు.
(4) కెసిఆర్ కొడుకు తారక రామారావును సిరిసిల్లలో వచ్చే ఎన్నికల్లో వోడించడం కోసం "తెరాస''లో తిరుగుబాటుదారైన కె.కె. మహేందర్ రెడ్డికి హరీష్ రావు రూ.50 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా అని రఘునందనరావు బాహాటంగా ప్రశ్నించాడు.
 

ఇంతకూ రఘునందనరావు కెసిఆర్ అతని సన్నిహితుడైనందున కుటుంబ వ్యవహారాలూ చాలావరకు దగ్గరగా ఉండి పరిశీలిస్తున్న రఘునందనరావు చేసిన ఆరోపణలను పార్టీ కార్యకర్తలు నమ్ముతున్న పరిస్థితి కెసిఆర్ రాజేకీయ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిందని పార్టీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయని పత్రికలూ రాస్తున్నాయి. యిది యిలా ఉండగానే, ఇంతకుముందే గుజరాత్ నుంచి హైదరాబాద్ వరకూ కెసిఆర్ పెంచుకున్న ఆస్తుల విలువ, ఇటీవల కాలంలో "ఉద్యమం'' పేరిట దండుకున్న మొత్తం విలువ వేలకోట్లలోనే ఉందని మరొకరి అంచనా! కాగా ఉస్మానియా ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక ప్రకటనలో కెసిఆర్ ఉద్యమం పేరిట పెంచుకున్న ఆస్తుల విలువ రూ. 40-50 వేలకోట్లు ఉంటుందని ఆరోపించారు!

 

అంతేగాదు, కెసిఆర్ కుటుంబం "తెలంగాణా వాదా''న్ని తడికలాగా "అడ్డంపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నార''నీ, "పెద్దమొత్తాలలో డబ్బులు వస్తూలు చేసుకుంటు''న్నారనీ రఘునందనరావు (17-05-2013) ప్రకటిస్తూ "హరీష్ రావు అక్రమ వసూళ్ళకు చెందిన పూర్తివివరాలతో, ఆధారాలతో హైకోర్టులో ప్రజాప్రయోజనవాజ్యం వేస్తున్నానని రఘునందనరావు ప్రకటించారు. ఇదిలా ఉండగా, కొలదిరోజులనాడు "సూర్య'' పత్రిక ఢిల్లీనుంచి ఒక వార్త విడుదల చేస్తూ కెసిఆర్ అక్రమఆస్తుల గురించి కేంద్రం సిబీఐ విచారణకు ఉత్తర్వులు జారీ చేయనున్నదని పతాక శీర్షిక ద్వారా వెల్లడించింది! ఒక ప్రజాప్రతినిధిగా హరీష్ రావు అక్రమవసూళ్ళపై సమగ్ర దర్యాప్తు కోరడంలో తన తప్పేమీ లేదని కూడా రఘునందనరావు స్పష్టం చేశారు.



అలాగే, "సినిమాల్యా''బ్ నిర్మాణం కోసం దర్శక నిర్మాత రాఘవేంద్రకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో వాణిజ్య సముదాయాలు కడుతున్నారంటూ బెదిరింపులకు పాల్పడి, రూ.80 లక్షలు వసూలు చేసినట్టు నిరూపించే సి.డీ.కూడా ఉందని రఘునందనరావు వెల్లడించడం కెసిఆర్ కుటుంబంలోనేగాక పార్టీ కార్యకర్తలలో గుబులుపుట్టింది. ఈ రూ.80 లక్షల "డీలు'' 'తెరాస' పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి నివాసంలోనే జరిగిందని రఘునందన్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలలో కొన్నింటికి హరీష్ రావు జవాబిచ్చారు, ఆరోపణలను పైకి మాత్రం ఖండించాడేగాని బలంగా తననుతాను సమర్ధించుకోలేకపోయాడు!

 

ఈ సందర్భంలోనే రఘునందనరావు డిజిపి దినేష్ రెడ్డిని కూడా కలుసుకుని అభియోగపత్రం ఇవ్వాలని నిర్ణయించి, డి.జి.పి.ని కలుసుకున్నారు. ఈ సంకటస్థితిలో కెసిఆర్ కుటుంబసక్షేమం సన్నివేశంలోనే హరీష్ రావి కుతుమ్బపరువును నిలబెట్టేందుకుగాను రఘునందనరావు ఆరోపణలను ఎలాగోలా ఖండించమని కెసిఆర్ కొడుకు తారక రామారావును బతిమాలుకోవడం మరో కోణం. కాని ఈ విషయంలో కెసిఆర్ తన మౌనాన్ని దారి మళ్ళించి, పదేపదే "సీమాంధ్రుల దోపిడీ''పై వక్రప్రకాహరంలో భాగంగా రాయలసీమకు కృష్ణజలాలు వెళ్ళకుండా నీటి సరఫరాను బంద్ చేస్తామని ప్రగల్భిస్తూ బెదిరింపుగానే ఒక ప్రకటన చేశాడు. కాని దశాబ్దాల తరువాత ఏ "సీమాంధ్రుల దోపిడీ'' పేరిట తెలంగాణా దొరల దోపిడీని ప్రజలు నహించారో ఆ ప్రజలు ఇప్పుడూ, రేపూ కూడా అదే 'దొరల' దోపిడీని ఇకపైన కూడా కొనసాగనివ్వరు. అందుకే రఘునందనరావు కెసిఆర్ కుటుంబసభ్యుల అవినీతి గురించి ఆధారాలతో హైకోర్టులో ప్రజావాజ్యం నడపబోవడమేగాక, 'తెరాస' నాయకులు పార్టీపేరిట వసూలు చేసిన కోట్లాది విరాళాలకు సంబంధించిన బాగోతాన్ని కూడా వెలికితాయడం కోసం సిబీఐని అర్థించబోవడంతో పాటు, ఈ భారీ విరాళాలు, జమపడని అపారమైన 'నిధుల్ని', ఆ గుప్తధనాన్ని వెలికితీయవలసిన అవసరముందని కూడా ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నారు.


'డంబం' పూవులయితే పూస్తుందేమోకాని, అది కాయలు కాయదట! నేడు కెసిఆర్ 'డంబం' కూడా అలాగే ఉంది! మనకు రఘునందనరావు చెప్పేదాకా తిరుపతిలో ఆయననుంచి "డబ్బులు'' పట్టానని ఈరోజు దాకా హరీష్ రావు చెప్పలేదు, బహుశా ముఖం చెల్లకపోయి ఉండవచ్చు. అలాగే ఇప్పటిదాకా "తెలుగుదేశం'' పార్టీలో ముఖ్యనాయకుడుగా, అనేక పదవులు వెళ్ళబెట్టిన కడియం శ్రీహరి ఇన్నాళ్ళూ వూడిగం చేసి చేసి అంతకుముందు "దేశం''మీద ఈగవాలనివ్వకుండా కాపాడుతూ అకస్మాత్తుగా తెలంగాణా "సీమాంధ్ర దోర'' పంచన చేరడాన్ని కూడా ప్రాంతప్రజలు హర్షించలేకపోతున్నారు! కెసిఆర్ లక్ష్యం చీలుబాటలు కాబట్టి శ్రీహరిని 'తెరాస'లోకి ఆహ్వానించడం ద్వారా తెలుగునాడు తన మాతృదేశం కానట్టుగా "మాత్రుభూమి విముక్తికోస''మే శ్రీహరి 'తెరాస'లో ప్రవేశించాడని కోతలు కోస్తున్నాడు. నిజానికి 'పార్టీలపక్షి' కెసిఆర్ మాతృభూమి శ్రీకాకుళ-విజయనగరమేగాని తెలంగాణా కాదు, కాదు!!