మోడీ ముందు కేజ్రీ పెట్టిన డిమాండ్లు ఇవే..!

ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కేజ్రీవాల్ విమర్శించడం..కేజ్రీవాల్ ఏం చేసినా మోడీ ప్రశ్నించడం ఇది రోజూ జరిగేదే. ఇలా రోజూ విమర్శల పర్వాన్ని కొనసాగించలేక విసుగుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధాని ముందు బంపర్ ఆఫర్ పెట్టారు. తాను సూచించిన ఐదు డిమాండ్లకు ప్రధాని ఓకే అంటే దేశంతో పాటు తాను సెల్యూట్ చేస్తానన్నారు. 

కేజ్రీవాల్ డిమాండ్లు ఇవే:-

1 ట్విటర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారిని ఫాలో అవకండి.
2. రోహిత్ వేముల మృతికి కారణమైన కేంద్రమంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. 
3. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఎన్నికల్లో నెగ్గి  ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి.           దొడ్డి  దారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం మానాలి.
4. ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని అంగీకరించండి.
5. భారత్ మాతాకీ జై అనని వారిపై దాడులు చేయడం మానండి. దాడులు చేసినవారిని జైలులో పెట్టండి. ప్రజల ఆహారపు          విషయాలలో జోక్యం చేసుకోకండి.