పాకిస్తాన్‌లో క‌రోనా మృతుల కోసం ప్ర‌త్యేక ఖ‌బ‌ర‌స్తాన్‌!

పాకిస్తాన్ ప్ర‌భుత్వం క‌రోనాతో చ‌నిపోయిన వారిని ఖ‌న‌నం చేయ‌డానికి ప్ర‌త్యేక ఖ‌బ‌ర‌స్తాన్ కోసం 80 ఎక‌రాల భూమి కేటాయించింది.  క‌రాచిలో ఈ స్మ‌శాన‌వాటికను సిద్ధం చేశారు. అంతే కాదు మృతుల‌ను పూడ్చిపెట్ట‌డానికి గొతుల‌ను కూడా త‌వ్వి సిద్ధంగా వుంచారు. మ‌రి కొన్ని స‌మాధులు త‌వ్వి సిద్ధంగా పెట్ట‌డానికి  ఏర్పాట్లు చేస్తున్నారు.

భార‌త‌దేశంలో ప్ర‌ధాన మంత్రి మోదీ క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం అవ్వ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులో భాగంగానే జ‌న‌తా క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ప‌క్క‌నే వున్న పాకిస్తాన్‌లో క‌రోనాతో జ‌నం చ‌నిపోతుంటే అక్క‌డి ప్ర‌ధాని మృతుల కోసం ప్ర‌త్యేకంగా స్మ‌శాన‌వాటిక ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ స్టైలే వేరు. 

క‌రోనాతో మృతి చెందిన వారిని ఖ‌న‌నం చేయ‌డం పాకిస్తాన్‌లో పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ట‌. ముస్లిం సాంప్ర‌దాయం ప్ర‌కారం మృత‌దేహానికి స్నానం చేయించ‌డం, కొత్త బ‌ట్ట‌లు చుట్ట‌డం, సుగంధ‌ద్ర‌వ్యాలు పోయ‌డం అలాంటివేవీ చేయ‌కుండా పాతిపెట్ట‌డాన్ని కొంత మంది మృతుల ప‌ట్ల చుల‌క‌న‌గా మాట్లాడుతూ వుండ‌టంతో దీనిపై ముస్లిం మ‌త‌పెద్ద‌లు ఫ‌త్వా ఇచ్చార‌ట‌. క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన వ్య‌క్తిని పాపాత్ముడుగా భావించ‌రాదు. అమ‌ర‌గ‌తి పొందిన అమ‌రుడుగా భావించాలి. అమ‌ర‌త్వం పొందిన వారికి ఖ‌న‌న సంస్కారాలు ఏమీ వుండ‌వు. అలా పూడ్చిపెట్ట‌వ‌చ్చ‌ని, వారికి ప్ర‌త్యేక ఖ‌బ‌ర‌స్తాన్‌లు ఏర్పాటు చేయ‌మ‌ని అక్క‌డి ముల్లాలు  స‌ల‌హా ఇచ్చార‌ట‌.