అమరావతి పై దాఖలైన 5 పిటీషన్ ల పై విచారణలు చేపడుతున్న హైకోర్ట్...


ఏపీ హైకోర్టులో అమరావతి పై దాఖలైన పిటిషన్ లపై విచారణ మొదలైంది. కర్నూలుకు హై కోర్టు తరలింపు సవాల్ చేస్తూ మొదటి పిటిషన్, మూడు రాజధానుల నిర్ణయం పై 37 మంది రైతుల పిటిషన్ వేశారు. సీఆర్డీఏకు రైతులు ఇచ్చే వినతి గడువు పెంచాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు పై ఇంకో పిటిషన్, సీఆర్డీయే రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పై నాలుగో పిటిషన్ ఇలా దాఖలైన  పిటిషన్ల పై ఏపీ హై కోర్టు విచారణ చేపట్టింది.ఏపీ హై కోర్టులో అమరావతికి సంబంధించి ఐదు కీలకమైన 5 పిటిషన్ ల మీద  హై కోర్టు విచారణను చేపట్టింది.

ప్రధానంగా  కర్నూల్ కి హై కోర్టు తరలింపు విషయంలో న్యాయవాదులు స్థానికంగా ఉన్న  రైతులందరూ  హైకోర్టును తరలించటానికి వీల్లేదంటూ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు.రెండువ పిటీషన్ రాజధాని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 37 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ లను దాఖలు చేశారు. సీఆర్డీయేకి రైతులిచ్చే వినతి గడువు పెంచాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పోలీసుల మీద కావచ్చు అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ పోలీసు యాక్టు 30 అమలును కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. మరో పిటిషన్ ను నిన్న అర్థరాత్రి సమయంలో సీఆర్డీయేను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ మరో పిటిషన్ ఇంకో ఇద్దరు రైతులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదు కీలకమైనటువంటి పిటిషన్ ల మీద హై కోర్టు న్యాయ స్థానంలో విచారణ చేపడుతున్నారు. ఈ కేసుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదాని  పై సర్వత్ర ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్నదని సమాచారం.