ఆదాయపన్ను లో మార్పులు లేవు

ఆదాయ పన్ను స్లాబ్‌లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఆదాయ పన్ను స్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని తేల్చిచెప్పారు. వార్షికాదాయం రూ. కోటి దాటితే 2 శాతం సూపర్‌రిచ్ పన్ను విధిస్తామని ప్రకటించారు. రూ. లక్ష పైన జరిగే ప్రతి లావాదేవీకి పాన్‌కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. సంపద పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక సేవలపై 15 శాతం పన్ను తగ్గింపు. సాంకేతిక సేవలపై పన్ను 25 నుంచి 10 శాతానికి తగ్గింపు, రూ. వెయ్యికి పైగా ధర కలిగిన పాదరక్షలపై 6 శాతం సుంకం. స్వదేశ పాదరక్షలు మరింత చౌక కానున్నాయి. లక్ష దాటిన అన్ని ఆర్థిక వ్యవహారాలకు పాన్‌కార్డు తప్పనిసరి అని జైట్లీ స్పష్టం చేశారు.