మన ఆర్థిక వ్యవస్థ సూపర్



కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతర ప్రసంగంలో మరికొన్ని విశేషాలు..

* మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని ప్రపంచం గుర్తించింది.

* అభివృద్ధిలో రాష్ట్రాలను భాగస్వాములను చేస్తాం. ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం.

* పెట్టుబడులకు భారతదేశం చాలా అనుకూలమైన ప్రదేశం.

* విదేశీ మారక నిల్వలు 320 బిలియన్లకు పెరిగాయి.

* దేశంలో
 పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగిస్తాం.

* దేశంలో ఎక్కువశాతం జనాభా 35 సంవత్సరాల వయసు కంటే తక్కువ వున్నవారే. మేకిన్ ఇండియా పథకం కింద వీరి శక్తిని ఉపయోగించుకుంటే మన దేశం ప్రపంచంలోనే గొప్ప తయారీ కేంద్రం అవుతుంది.

* స్కిల్ ఇండియా పథకం కింద నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇస్తాం.

* 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా పూర్తయింది.

* ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తేవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం.

* ద్రవ్యోల్పణ నియంత్రణలో మా ప్రభుత్వం విజయం సాధించింది.

* 2015-15లో వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం వుంటుందని అంచనా వేస్తున్నాం.