పాక్ కు చావుదెబ్బ... 20 మంది సైనికులు హతం

 

పాక్ కు చావుదెబ్బ... 20 మంది సైనికులు హతం పాక్ బలగాలు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కాల్పులు జరిపిన పాక్ కు భారత్ సైన్యం కూడా అదే రేంజ్ లో సమాధానం చెబుతుంది. ఇప్పటికే పాక్ పై సర్జికల్ దాడులు జరిపి బుద్ది చెప్పిన భారత సైన్యం ఇప్పుడు మరోసారి పాక్ ను చావుదెబ్బ కొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడిన భారత సైన్యం.. నాలుగు శిబిరాలను ధ్వంసం చేసి 20 మంది పాక్ సైనికులను హతమార్చింది. అయితే ఈ ఘటన గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచ్చిల్ సెక్టార్‌లో ఇటీవల ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి వచ్చి భారత సైనికుడి తల నరికిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత బలగాలు గత నెల 29న పాక్ బలగాలపై విరుచుకుపడ్డాయి. భారత్ కాల్పుల్లో నాలుగు పాక్ సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్మీ పోస్ట్ హెడ్ క్వార్టర్ నేలమట్టమైంది. ఈ ఘటనలో 20 మంది శత్రుదేశ సైనికులు హతమయ్యారు.