చిన్న గుండె.. బెంగళూరు - చెన్నై

 

కొద్ది రోజుల క్రితం బెంగళూరు నుంచి చెన్నై ఆస్పత్రికి ఒక గుండెను రికార్డు టైమ్‌లో తరలించి వైద్యులు ఒకరి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి సంఘటనే ఇప్పుడు మరొకటి జరిగింది. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ళ బాలుడి అవయవాలను ఆ బాలుడి తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడి గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ళ బాలుడికి అమర్చడం కోసం బెంగళూరు నుంచి చెన్నైకి ఆ చిన్నారి గుండెను నాలుగు గంటల్లో తీసుకొచ్చారు. దీనికి రెండు రాష్ట్రాలకూ చెందిన పోలీసులు సహకరించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఆ గుండెను సకాలంలో ఫోర్టిన్ మలార్ ఆస్పత్రికి చేర్చారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి నుంచి ఎయిర్ పోర్టు వరకు అక్కడి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. చెన్నై విమానాశ్రయంలో సిద్ధంగా వున్న ఫోర్టిన్ ఆస్పత్రి అంబులెన్స్‌లో పోలీసుల సహకారంతో చిన్నారి గుండెను సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. శుక్రవారం సాయత్రం శస్త్ర చికిత్స చేసి ఒక బాలుడికి అమర్చారు.