20 రోజుల్లో ఐదు గోల్డ్ మెడల్స్ సాధించిన హిమా దాస్ !

భారత స్ప్రింటర్ హిమ దాస్ కేవలం 20 రోజుల్లో ఐదు బంగారు పతకాలు సాధించి దేశం గర్వించే ప్రదర్శన ఇచ్చింది. అస్సాంకు చెందిన ఈ 19 ఏళ్ల రన్నర్ యూరప్‌లో ఈనెల 2న తొలి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుంచి వరసపెట్టి ఐదు బంగారు పతకాలు గెలుచుకుంది. మొదటగా జులై 2న పోలాండ్‌లో పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో పాల్గొన్న హిమ దాస్ 200 మీటర్ల రేస్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 

న్న హిమ దాస్ 200 మీటర్ల రేస్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 

ఆ తరవాత జులై 7న పోలాండ్‌లోనే కుట్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో అగ్రస్థానంలో నిలిచి రెండో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత జులై 13న చెక్ రిపబ్లిక్‌లో క్లాడ్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో మూడో గోల్డ్ మెడల్ గెలిచింది. ఇక ఆ దేశంలోనే 17వ తేదీన జరిగిన టాబర్ అథ్లెటిక్స్ మీట్‌లో నాలుగో బంగారు పతకం సాధించింది. అక్కడే జరిగిన 400 మీటర్ల రేస్‌లో ఐదో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. 

ఇలా కేవలం 20 రోజుల్లోనే ఐదు బంగారు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని చాటింది. ప్రస్తుతం హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేసి ఆమె సొంత రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతుంటే కోట్లు సంపాదించే క్రికెటర్లు ట్వీట్లతో సరిపెడితే ఆమె మాత్రం తన రెమ్యునరేషన్ లో సగం రాష్ట్రానికి ఇచ్చి పెద్ద మనుసు చాటుకున్నారు‌. ఈ పరుగుల రాణికి భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. అలాగే పలువురు క్రీడాకారులు సినీ ప్రముఖులు ఆమెను ప్రశంసిస్తున్నారు.