తమిళనాడులో ఘోర ప్రమాదం.. భారీ వర్షానికి భవనం కూలి 17 మంది మృతి

 

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఊటీ , మెట్టుపాళ్యంలోని ఓ కొండ పై ఉన్న భవంతి గోడ కూలిన ఘటనలో 17 మంది చనిపోయారు. మెట్టుపాళ్యం ప్రాంతంలో కూలిన బిల్డింగ్ శిథిలాల కింద కూడా పలువురు చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ లో నివసిస్తున్న వారు శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. బాధితులు అంతా కూడా ఊటీ సమీపంలో టీ ఆకు తోటల్లో పని చేసే కార్మికులు. వీళ్లంతా కూడా ఆ కొండ ప్రాంతంలో వరుసగా ఇళ్ళను కూడకట్టనున్నారు. 

ప్రతిసారీ వరదలు భారీ వర్షా లు కురిసినప్పుడు అది కూడా మూడు నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు ఆ కొండ ప్రాంతంలో మట్టి కదిలి కొన్ని సార్లు కొండచరియలు విరిగిపడుతుండడమే కాక కొన్నిసార్లు ఇళ్ళు కూడా కుప్పకూలిపోతూ ఉండటం అక్కడ సహజమే. గతంలో కూడా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయని అక్కడి స్థానికులు వెల్లడించారు. ఈ తరహా ఇంత మంది ప్రాణాలు పోయిన సందర్భం ఘటన మాత్రం ఇదే మొదటి సారి అని తెలుస్తొంది. గత మూడు రోజులుగా మట్టి బాగా నాని ఉండటంతో పెద్దగోడ ఒక్కసారిగా కూలీ ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు మరో ముగ్గురు పిల్లలున్నారు, ఇంకో పదిహేను మంది వరకూ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.