అమ్మాయిలకు అందుబాటులో.. 112 కు ఫోన్ చేస్తే నిమిషాల్లో మీ ముందుకు పోలీసులు

 

అర్థరాత్రి అమ్మయిలు బయట తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పారు. సాయంత్రం పూట.. చీకటి పడుతుంది అంటే చాలు అమ్మాయిని బయటకు పంపడానికి భయపడే స్థాయికి దేశం దిగజారిపోయింది. కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఒక అమ్మయిని చూడగానే మనిషిలో ఉండే మృగం క్షణాలలో బయటకి వస్తున్నాడు. అలా అమ్మయిలు చాలాసార్లు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అలాంటి సమయంలో వాళ్ళు సమాచారం ఎవరికి అందించాలో తెలియక ఖంగారు పడుతుంటారు. తాజాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి విషయంలో అదే జరిగింది.చెల్లెలితో ఫోన్ మాట్లాడుతూ కాసేపు మాట్లాడు అని అంటూనే ఉంది కానీ ఆ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి అడుగు తీసుకోవాలనేది తనకి తెలీలేదు. 

అందరి చేతిల్లో ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా 112 అనే నెంబరు మీ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని.. అది అత్యవసర ఎమర్జెన్సీ నెంబర్ గా పెట్టుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏ రకమైన ఎమర్జెన్సీ అయినా సరే మెడికల్.. ఫైర్..ఏదైనా సరే.. ఆడవారి సెక్యూరిటీ.. చైల్డ్ ప్రొటెక్షన్ కాని దేనికి సంబంధించిన ఎమర్జెన్సీ ఉన్నా.. 112 అనే నెంబర్ చాలా ఉపయోగకరమైనది అని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ ని ఉపయోగించే పరిస్థితిలో లేకపోతే.. ప్రస్తుతం వస్తున్న ప్రతి మొబైల్ లో పానిక్ బటన్ అనేది అందుబాటులో ఉందని వెల్లడించారు. పానిక్ బటన్ అంటే.. ఫోన్లో ఉన్న పవర్ బటన్ ని మూడు సార్లు వరుసగా ప్రెస్ చేస్తే 112 కి ఆటోమెటిగ్గా కనెక్ట్ అయిపోతుందని అధికారులు వెల్లడించారు. దానివల్ల ఆ వ్యక్తి ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు అన్న విషయం తెలిసిపోయి, జిపిఎస్ ద్యారా పోలీసులు ఆ ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు అని వెల్లడించారు. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ లేని పక్ష్యంలో నార్మల్ ఫోన్ లో 5 కాని 9 కాని.. ఈ రెండిటిలో ఏదో ఒక కీ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిగ్గా 112కి కనెక్టవుతుంది అంతేకాక ఆ వ్యక్తి ఎమర్జెన్సీలో ఉన్న విషయాన్ని గుర్తించి అధికారులు మిమ్మల్ని చేరుకోగలగుతారు అని అధికారులు ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.