మహేష్ తో సెల్ఫీ కావాలంటున్న 106 ఏళ్ల బామ్మ

 

'మహేష్.. ఆ పేరులోనే ఏదో మత్తుంది' అని అష్టాచమ్మా సినిమాలో కలర్స్ స్వాతి అంటుంది. ఆ సినిమాలో స్వాతి అనే కాదు.. బయటకూడా చాలామంది అమ్మాయిలు మహేష్ ని అమితంగా ఇష్టపడుతుంటారు. మహేష్ కి పెళ్ళై పిల్లలున్నా కూడా మహేష్ ని కలల రాజకుమారుడిగా ఊహించుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు. అయితే అమ్మాయిలలో మహేష్ కి ఫాలోయింగ్ ఉండటం సహజం. కానీ వెరైటీగా 106 ఏళ్ల బామ్మ మహేష్ కి పెద్ద ఫ్యాన్ అట. అంతేకాదు మహేష్ తో ఓ సెల్ఫీ దిగాలని ఆ బామ్మ కోరికట.

రాజమండ్రి కు చెందిన రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ల బామ్మగారికి మహేష్ అంటే అభిమానం. ఆవిడ మహేష్ తో సెల్ఫీ దిగాలని ఎదురుచూస్తోంది. ఆ విషయం కాస్తా మీడియా ద్వారా మహేష్ కి తెలిసినట్టు సమాచారం. మహేష్ బామ్మతో సెల్ఫీ దిగడానికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ బామ్మ మహేష్ తో ఎప్పుడు సెల్ఫీ దిగుతారో చూడాలి. ఆ బామ్మ ఆనందం కోసం మహేష్ త్వరగా సెల్ఫీ దిగితే బాగుండని అభిమానులు ఎదురుచూస్తున్నారు.