వైకాపా గురునాథరెడ్డి భార్య ఓటు గల్లంతు.. ఎట్టకేలకు ఓటు!

 

 

 

ఎన్నికలలో ఓట్లు గల్లంతు కావడం మామూలే. సాధారణ ఓటర్ల ఓట్లు గల్లంతు అయితే పెద్దగా పట్టించుకునేవారు వుండరు. ప్రముఖుల ఓట్లు గల్లంతు అయితేనే అవి వార్తల్లోకి వస్తూ వుంటాయి. గతవారం హైదరాబాద్‌లో బ్రహ్మానందం ఓటు గల్లంతయితే అందరూ అయ్యోపాపం అనకపోగా, బ్రహ్మానందం కమెడియన్ కదా.. అందుకే నవ్వేశారు. ఇప్పుడు సీమాంధ్రలో కూడా ఓట్ల గల్లంతు వార్తలు బోలెడన్ని వెలుగులోకి వస్తున్నాయి.

 

అనంతపురం అర్బన్ నియోజకవర్గం జగన్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి భార్య  కేఎస్ఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేయడానికి వెళ్లారు. అందరితోపాటు వరుసలో నిలబడి లోపలకు వెళ్లారు. అప్పటికే ఆమె ఓటు ఎవరో వేసేసినట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారు.  దాంతో గురునాథరెడ్డి అధికారులతో  వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. తరువాత అధికారులు వచ్చి ఆమెకు ఓటు వేసే అవకాశం కల్పించారు.


అనంతరం గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము వెళ్లేసరికే తన భార్య  ఓటును ఎవరో వేసేశారని చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి తన భార్యకు  ఓటు వేసే అవకాశం కల్పించినట్టు  తెలిపారు.