ఎర్రన్నాయుడు మృతి, విషాదంలో చంద్రబాబు

Yerram Naidu Dead, Yerram Naidu Death, Yerram Naidu died, Yerram Naidu dies, Yerram Naidu passed away, Yerram Naidu nomore

 

టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మృతి బాధాకరమని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తపరిచారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందిన చంద్రబాబు పార్టీకోసం ఎర్రన్నాయుడు అంకిత భావంతో పనిచేశారని గర్తు చేశారు. ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోలేదన్నారు.

 

ఎర్రన్నాయుడు నిజాయితీ గల వ్యక్తి అని, ఆయన మృతితో కుడి భుజాన్ని కోల్పోయినట్లయిందని ఆయన చెప్పారు. ఎర్రన్నాయుడు మృతితో ఈ రోజు పాదయాత్రను రద్దు చేస్తున్నామని, రేపటి నుంచి యథాతథంగా పాదయాత్ర జరగనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎర్రన్నాయుడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించడానికై చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరివెళ్లారు.