కేసిఆర్ ఫై కొండా సురేఖ ఫైర్

 

 

 

 

టిఆర్ఎస్ అధినేత కే. చంద్ర శేఖర రావు, తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకొంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండ సురేఖ ఆయన ఫై ఘాటుగా విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకురాలు షర్మిలా చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా వరంగల్ జిల్లా పరకాలలో సురేఖ నిన్న విలేఖరులతో మాట్లాడారు.

 

ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల రక్తంతో కేసిఆర్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని సురేఖ ఆరోపించారు. ఒక వైపు విద్యార్దులు ప్రాణ త్యాగాలు చేస్తోంటే, ప్యాకేజీ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో చర్చలు జరపడం ఏమిటని ఆమె విమర్శించారు.

 

ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ తెలంగాణా కు అనుకూలంగా మాట్లాడితే, ఎన్ని రోజుల్లో తెలంగాణా సాధించాగలరో చెప్పాలని ఆమె అన్నారు. నిర్ణీత గడువులోగా తెలంగాణా తెలేకపోతే, టిఆర్ఎస్ నేతలంతా తమ పార్టీలోకి రావాలని, తెలంగాణా వస్తే, తాము టిఆర్ఎస్ వెనుక నడుస్తామని ఆమె ప్రకటించారు. ఈ అఖిల పక్ష సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆమె సూచించారు.

 

ఏది ఎలా ఉన్నా, ఇలా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎంత వరకూ సబబో గతంలో మంత్రిగా కూడా పని చేసిన సురేఖ ఒక్క సారి ఆలోచించుకుంటే బాగుంటుంది.