అడుసు తొక్కనేల…?

 

 

telangana issue, separate telangana, telangana congress, congress telangana issue

 

 

తెలంగాణ ఇష్యూ రాను రాను కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతుంది.. అందుకు తగ్గట్టుగానే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పెద్దలు మాట జారి సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు.. అయితే ఇది పార్టీ స్ట్రాటజీనా లేక నిజంగానే నాయకులు నోరు జారుతున్నారా అన్న విషయం అర్ధం కాక టీ కాంగ్‌ నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు..

 

        రాజశేఖర్‌ రెడ్డి మరణం తరువాత తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దీనంగా తయారయింది.. అర్ధరాత్రి చిదంబరం చేసిన డిసెంబర్‌ 9 ప్రకటన తరువాత సీమాంద్ర సెగలతో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవడంతో మొదలైన మాటల తడబాటు ఇంకా కొనసాగుతూనే ఉంది..

 

      చిదంబరం తరువాత జాతీయ స్థాయి నాయకులే చాలా మంది తెలంగాణ పై వివాధాస్పద వ్యాఖ్యలు చేశారు.. వీరప్పమొయిలీ, గులాం నబీ అజాద్‌, రేణుక చౌదరి లాంటి సీనియర్‌ నాయకులు కూడా తెలంగాణపై అనుచిత వ్యాఖ్యాలు చేసి తరువాత నాలుక కరుచుకున్నారు..



        ఇప్పడు తాజాగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పీసీ చాకో కూడా ఇలాంటి వ్యాఖ్యనే చేశారు.. అసలు తెలంగాణ అంశం కాంగ్రెస్‌ ఎంజెండాలోనే లేదంటూ చెప్పి టి కాంగ్‌ నేతలందరినీ ఇరకాటంలోకి నెట్టేశారు.. చాకో మాటలపై తెలంగాణ నేతలు కత్తుల దూయటంతో మరోసారి ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నాడు..



        అయితే నిజంగానే కాంగ్రెస్‌ నేతలు మాట జారుతున్నారా.. లేక కావాలనే రాజకీయ వేడి పుట్టిస్తున్నారా.. అన్న విషయం మాత్రం ఎవరికీ అర్ధం కావటం లేదు.. కానీ ప్రతిసారి ఇలా మాట్లాడటం మళ్లీ మాట మార్చడంపై సామాన్యులు మాత్రం అడుసు తొక్కనేల అంటూ పెదవి విరుస్తున్నారు..