బాల తల్లులు : వారానికి 1700 మంది!

 

 

 

అమెరికాలో 15 నుంచి 17 సంవత్సరాల మధ్యన వున్న బాలికలు తల్లులు కావడం చాలా సాధారణమైన విషయం. అమెరికాలో ప్రతి వారం దాదాపు 17 వందల మంది బాలికలు తల్లులు అవుతున్నారని అక్కడి యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన ఒక రిపోర్టులో వెల్లడించింది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని ఆ రిపోర్టు తెలిపింది. తల్లులవుతున్న అమ్మాయిలు ఇంత చిన్నవయసులో తల్లులైపోయామే, ఇది నైతికంగా తప్పు కదా అని బాధపడటం లేదట. ఇంత చిన్న వయసులో తల్లులు కావడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందేమోనని బాధపడుతూ వుంటారట.