కొత్త నేతలతో టికెట్ల గోల

 

 

 

తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటున్నాయని నేతలు సంబరపడుతున్నా, అదే చివరకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉంది. కొత్తగా వస్తున్న నాయకులు అప్పటికే రాజకీయాల్లో పండిపోయి ఉండటం, ఇప్పుడు ఏదో ఒకటో లేదా రెండు మూడు స్థానాల విషయంలో హామీలు తీసుకున్న తర్వాత మాత్రమే టీడీపీలోకి రావడం ఇందుకు అసలు కారణం. ఫలానా లోక్ సభ స్థానం, ఇన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు ఇవ్వాలనే షరతుకు పార్టీ అంగీకరించిన తర్వాత మాత్రమే వాళ్లు వస్తున్నారు. కానీ, ఇది ఆయా పార్టీలలో అంతర్గత తగాదాలకు కారణం అవుతోంది.

 

కొండా సురేఖ, మురళి దంపతులకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. ఖిలా వరంగల్‌లో ఓ వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని అతనిని ఆస్పత్రికి తరలించారు.



ఇక రాయపాటి వచ్చినా, ఇంకెవరు వచ్చినా నర్సరావుపేట ఎంపీ టికెట్ మాత్రం తనదేనని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ తేల్చిచెప్పారు. సిట్టింగ్ ఎంపీనైన తనను కాదని కొత్తవారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నర్సరావుపేట బరిలో దిగి తాడోపేడో తేల్చుకుంటానని వెల్లడించారు.



ఇలా అన్ని పార్టీల్లోనూ కొత్త చేరికలతో తలనొప్పులు ఇప్పుడిప్పుడే మొదలువుతున్నాయి. ఇవి ఇంకెంత ముదురుతాయో, ఏ స్థాయికి వెళ్తాయో చూడాల్సిందే.