స్వామి కమలానంద అరెస్టు

 

 

 Swami Kamalananda arrested, Swami Kamalananda criticised akbaruddin speech, Swami Kamalananda arrested

 

 

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన స్వామి కమలానంద భారతిస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 8న ఇందిరాపార్కు వద్ద జరిగిన సమావేశంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో హైదరబాద్ నుంచి వెళ్లిన సిట్ పోలీసు బృందం కమలానందను అదుపులోకి తీసుకున్నారు.

 

స్వామి కమలానందను శ్రీశైలంలో అరెస్టు చేసిన పోలీసులు  హైదరాబాద్‌కు తరలించారు. విచారణ అనంతరం కమలానందను పోలీసులు సికింద్రాబాద్‌లోని జడ్జి క్వార్టర్స్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రాథమిక విచారణ జరిపిన న్యాయమూర్తి స్వామిక పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపారు. దీంతో పోలీసులు కమలానందను చర్లపల్లి జైలుకు తరలించారు.



స్వామి కమలానంద భారతిస్వామిని పోలీసులు అరెస్టు చేయడంపై స్వామి స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పర్వదినమైన సంక్రాంతి రోజున కమలానందను ప్రభుత్వం అరెస్టు చేయడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని స్వరూపానంద విమర్శించారు.