ఇంగ్లాండ్ పై సెహ్వాగ్ దూకుడు
Publish Date:Nov 15, 2012
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో సెహ్వాగ్ రెచ్చిపోయాడు. వన్డేను తలపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి సెహ్వాగ్ సెంచరి నమోదు చేశాడు. 90 బంతుల్లో 15 ఫోర్లు ఓ సిక్సర్ తో శతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో రెండేళ్ళ తరువాత సెహ్వాగ్ సెంచరి చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు సెహ్వాగ్, గౌతంగంభీర్ శుభారంభం చేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.