యువరాజుకు కోపమొచ్చింది..!

Publish Date:May 27, 2013

 

 

 

 

రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టిన కేంద్రికరించారు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాందీ.. ఇప్పటికే కేంద్రంలో రాష్ట్రంలో అంటుకున్న అవినీతి బురదను కడుక్కోలేక సతమతమవుతున్న పార్టీ అధిష్టానానికి.. జగన్‌ కేసులో సిబిఐ వేస్తున్న చార్జీ షీట్లు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి..

 

అందుకే ఈ విషయంలో కాస్త కటువుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు రాహుల్‌.. కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రులు బన్సల్‌, అశ్వనీకుమార్‌లకు ఉద్వాసన పలికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఓ హెచ్చరిక చేశారు..

 

 

Rahul Gandi Congress, Congress Rahul Gandi, cm kiran kumar reddy, 2014 elections


       

ఇందులో భాగంగానే జగన్‌ అక్రమాస్తుల కేసులో నింధితులుగా నమోదైన ధర్మాన, సభితలను మంత్రి వర్గం నుంచి తొలగించారు.. ఈ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతగా మంత్రులకు వత్తాసు పలికినా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు.. మంత్రులను తొలగించాల్సిందే అంటూ కరాఖండిగా చెప్పడంతో సియం కూడా మెట్టు దిగక తప్పలేదు..


        అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మిగతా మంత్రులకు వణుకు పుట్టిస్తుంది.. ఇప్పటికే మెపిదేవి జైలులో ఉండగా తాజా ధర్మాన, సభితలు రాజీనామాలు చేశారు.. వీళ్లేకాక పొన్నాళ లక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణ, గీతారెడ్డిలపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వస్తున్నాయి.. దీంతో వీరి భవిష్యత్తు ఏంటి అని గుసగుసలాడుకుంటున్నారు కాంగ్రెస్‌ వర్గాలు..        మరో ఏడాదిలో ఎలక్షన్లు ఉండటంతో పార్టీపై ఎలాంటి అవినీతి మచ్చ పడకుండా ఉండేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారిని పదవుల నుంచి తొలగించాలని యువరాజు రాహులు స్పష్టమైన సందేశాలను పంపిచారు.. అంతేకాదు తను అమ్మ సోనియాలా సాఫ్ట్‌ కాదని నాన్నమ్మ ఇందిరలా కఠిన నిర్ణయాలను తీసుకుంటానని చెప్పకనే చెపుతున్నాడు.. దీంతో ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గంలో కలకలం మొదలైంది..        ఈ నెల 29న సియం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై వేటు తప్పదన్న టాక్‌ బాగా వినిపిస్తుంది.. సాక్ష్యాత్తూ ప్రదాన మంత్రే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపిఏను ఇప్పుడు రాహుల్‌ మొదలెట్టిన ప్రక్షాలణా కార్యక్రమం ఎంతవరకు గట్టెక్కిస్తుందో చూడాలి..