పిర్యాదుచేస్తే...యువతిని చితకబాదిన పోలీసులు

 

 

 Punjab police thrash girl for complaining of sexual harassment, Punjab Police beat up woman after she complains of sexual harassment

 

 

భారతదేశంలో మహిళాలకి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారనేది గత కొంత కాలంగా జరుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. రోజు రోజుకి మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయే తప్ప, తగ్గే మార్గం కనపడడం లేదు. తాజాగా పంజాబ్ లో మరో ఘోరం జరిగింది. కాపాడవాలిసిన రక్షక భటులే రాక్షసుల్లాగా ప్రవర్తించారు.


ఓ యువతని రోడ్డుపై ట్రాక్ డ్రైవర్లు ఎడిపించగా కంప్లైంట్ చేయడానికి వెళ్తే..పోలీసులు ట్రక్కు డ్రైవర్లను వెనుకేసుకు వచ్చి తండ్రీ కూతుళ్లను నడి వీధిలో చితకబాదారు. అక్కడ ఉన్నవారు కూడా పోలీసులకు అడ్డుపడకుండా..సినిమా షో చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో చిత్రీకరించడ౦తో పోలీసులు వ్యవహారం బయటకు వచ్చింది.


ప్రభుత్వం ఆ పోలీసులను సోమవారం నాడు సస్పెండు చేసింది. ఈ ఘటనపై బాధిత యువతి స్పందిస్తూ.. తనపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం కాదని, ఉద్యోగంలో నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధిత మహిళ చెప్పింది. ఈ ఘటనపై ఎంపి జయబాచ్చన్ పార్లమెంటులో ప్రస్తావించారు. మీడియా రోజుకో కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకు వస్తుందని, సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందన్నారు.