ఢిల్లీలో రాష్ట్రపతి పాలన

 

 

 

ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని పేర్కొంది. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదని గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి తెలియజేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన గవర్నర్ పట్టించుకోలేదు. అసెంబ్లీని రద్దు కాకుండా..రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిపారసు చేశారు.


గవర్నర్ నజీబ్ జంగ్ సిపారసు కేజ్రీవాల్ తప్పుబట్టారు. మెజారిటీ ఉన్న ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడంలేదని, అందుకే రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రివర్గం  ఆమోదం తెలిపిందని ఆరోపించారు.