అమెరికాతో ఇక గొడవపడం..

 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న 45వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈయన విజయంపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొట్రిగో డుటెర్టె స్పందించారు. అమెరికా అధ్యక్షునిగా గెలుపొందిన ట్రంప్ కు అభినందనలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘అమెరికాతో ఇక గొడవ పడాలనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ట్రంప్‌ ఉన్నార’ని వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ కు, తనకు చాలా విషయాల్లో సారూప్యత ఉందని.. ఎవరిమీదైనా విమర్శలు చేయడంలో తామిద్దరి తర్వాతే ఎవరైనా అని తెలిపారు. ట్రంప్ చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

 

కాగా గత కొద్ది రోజులుగా  అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా డుటెర్టె తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని, బరాక్ ఒబామా నరకానికిపోతాడని గతంలో దుయ్యబట్టారు.