నోట్ల రద్దుపై రచ్చ.. ఉభయ సభలు రేపటికి వాయిదా..

 

మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద దుమారమే రేగింది. రెండు సభల్లోనూ నోట్ల రద్దుపై చర్చ జరపాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనలు చేపట్టారు. లోక్‌సభలో విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. స్పీకర్ పొడియంను చుట్టుముట్టాయి. స్పీకర్ ఎంత వారించినా విపక్షాలు వినలేదు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు ప్రకటించారు.

 

ఇక సభ ప్రారంభమైనప్పటి నుండి రాజ్యసభ వాయిదా పడుతూనే ఉంది.  నోట్ల రద్దు అంశంపై ఛైర్మన్‌ పోడియం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి.  ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ దీనిపై వివరణ ఇస్తారని చెప్పినా వారు శాంతించకపోవడంతోస ప్రతిపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.