యూఏఈపై పాక్ ప్రతాపం...

 

ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచుల్లో భారత్, వెస్టిండీస్ జట్లపై ఓడిపోయిన పాకిస్ధాన్ చిన్న జట్ల మీద మాత్రం బాగానే రాణిస్తోంది. జింబాబ్వేపై గెలిచి బోణి కొట్టిన పాక్, పసికూన యూఏఈపై తన ప్రతాపం చూపించి విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్ ప్రపంచ కప్ నాకౌట్ అవకాశాన్ని కాపాడుకుంది. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు తీసిన పాకిస్థాన్ యూఏఈని 50 ఓవర్లలో 210-8 స్కోరుకు కట్టడి చేసింది. పాకిస్థాన్ జట్టులో మొదటి బ్యాటింగ్ కు దిగిన అహ్మద్ షెహజాద్, హారిస్ సొహైల్ నిలకడగా ఆడి భారీ స్కోరు సాధించారు.