తనతో విబేధాలు లేవు.. కోపంతో మాట్లాడా.. సుప్రీంకు రోజా


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. రోజా పిటషన్ పై విచారించిన సుప్రీం నిన్ననే విషయం తేల్చి చెప్పింది. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందకుగాను సారీ చెప్పాలని.. తుది నిర్ణయం అసెంబ్లీదేనని చెప్పింది. అయితే దీనిపై రోజా మళ్లీ సుప్రీంకు లేఖ రాసింది. తనకు టీడీపీ ఎమ్మెల్యే అనితతో ఎలాంటి విబేధాలు లేవు.. తనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. తనను కావాలనే రెచ్చగొట్టారని.. వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు.. అందువల్లే కోపంతో ఏదైనా మాట్లాడి ఉంటే.. ఆ మాటలని ఉపసంహరించుకుంటున్నానని.. తన లేఖను పరిగణలోకి తీసుకోవాలని, తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. అయితే దీనిని స్వీకరించిన సుప్రీం.. సభలోకి అనుమతి విషయంలో శాసన సభనే సుప్రీం అని చెప్పింది. సస్పెన్షన్ పైన తుది నిర్ణయం కూడా సభదేనని చెప్పింది. కావాలంటే మీరు మీ పిటిషన్ విత్ డ్రా చేసుకోవచ్చునని సూచించింది. అనుచిత వ్యాఖ్యలు మాత్రం సరికాదని సుప్రీం మరోసారి తెలిపింది.


ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. అసెంబ్లీలో దృష్ట సాంప్రదాయం ఏర్పడింది.. దానిపైనే నాపోరాటం అని అన్నారు. ఇంకా అసంబ్లీని కోర్టు గౌరవిస్తుంది.. కోర్టును కూడా అసెంబ్లీ గౌరవిస్తుందని భావిస్తున్నా.. ఇంకా వీటికి ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్దివైపు దృష్టిసారించాలని సూచించారు.